: అమాంతం పెరిగిన ఐఐటీ ఫీజులు!


ఐఐటీలో విద్యాభ్యాసం మరింత ప్రియమైంది. ఐఐటీ ఫీజులను భారీగా పెంచుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ ఉదయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 90 వేలుగా ఉన్న ఫీజులను ఏకంగా రూ. 2 లక్షలకు పెంచేసింది. ఈ ఫీజులను రూ. 3 లక్షలకు పెంచాలని బాంబే ఐఐటీ డైరెక్టర్ దేవాంగ్ ఖాకర్ అధ్యక్షతన ఏర్పడ్డ ఉప సంఘం ప్రతిపాదించగా, అంత మొత్తం పెంచితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనతో రూ. 2 లక్షలకు ఫీజుల పెంపు పరిమితం చేసినట్టు తెలుస్తోంది. ఇక మినహాయింపుల విషయానికి వస్తే, ఏడాదికి రూ. లక్షలోపు ఆదాయమున్నా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విభాగాల్లో సీటు పొందినా పూర్తి ఫీజు మాఫీ వర్తిస్తుంది. ఇక సాలీనా రూ. 5 లక్షల్లోపు ఆదాయముంటే మూడింట రెండు వంతుల ఫీజు మాఫీ సౌకర్యం అందుతుంది.

  • Loading...

More Telugu News