: తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఆదాయపు పన్ను వసూళ్లు
దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధిక ఆదాయపు పన్ను వసూళ్లు జరిగాయని ఇన్ కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్‌బాబు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది రూ.36,663 కోట్ల పన్ను వసూలు అయినట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ పన్ను శాతం 15.4 మేర ఎక్కువగా వసూలైందని చెప్పారు. ఈ ఏడాది 4,83,398 మంది మొదటిసారిగా పన్ను కట్టారని తెలిపారు. ఆడిటింగ్ పుస్తకాలు లేకుండా ఈ-ఫైలింగ్ చేసే విధానంపై ఆయన మాట్లాడుతూ.. రూ.2 కోట్ల మేర వార్షిక ఆదాయం ఉన్నవారు ఈ విధానాన్ని అవలంబించొచ్చని చెప్పారు.