: చింటూను టార్గెట్ చేస్తూ బాంబు పేలుడు!
చిత్తూరు మేయర్ కఠారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూను హతమార్చేందుకు చిత్తూరు కోర్టు ఆవరణలో బాంబు పేలుడు జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మేయర్ దంపతుల హత్య కేసులో విచారణలో భాగంగా చింటూను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. గత 3 నెలలుగా పదిహేను, ఇరవై సార్లు చింటూ కోర్టుకు హాజరయ్యాడు. ఈ విషయాలన్నింటిని గమనిస్తున్న చింటూ ప్రత్యర్థులు అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. కాగా, ఈ దాడిలో ఇద్దరు గాయపడగా, మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.