: భీమవరం హోటల్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మెనూ!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మానియా ఒక రేంజ్ లో ఉందని చెప్పడానికి ఈ వార్తే నిదర్శనం. పవన్ చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక హోటల్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మెనూ పేరిట ఒక మెనూ తయారు చేసింది. 'సర్దార్ గబ్బర్ సింగ్ ఆఫర్.. మా ఆఫర్ కి కొంచెం తిక్కుంది, కానీ, దానికో లెక్కుంది' అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్న ఆ మెనూ వివరాలేమిటంటే... సర్దార్ స్పైస్ రైస్, కాజల్ కర్డ్ రైస్, బుల్లెట్ స్నాక్స్, డీఎస్పీ కర్రీ ఆ మెనూలో ఉన్నాయి. కాగా, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలైన రోజే ఆ చిత్రాన్ని తమ థియేటర్లలో చూస్తే ఉచితంగా కూల్ డ్రింక్ లిస్తామంటూ కొన్ని థియేటర్లు ఆఫర్లు ప్రకటించడం తెలిసిన విషయమే.

  • Loading...

More Telugu News