: చిత్తూరు కోర్టు ఆవరణలో భారీ పేలుడు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు కోర్టు ఆవరణలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి. కాగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.