: తెలుగుదేశం పార్టీ లోకేశ్ తాతదే!: టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్


తెలుగుదేశం పార్టీ నారా లోకేశ్ తాతదేనని, రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఆయన పోటీ చేసినా, లక్ష ఓట్లకు పైగా మెజారిటీ ఖాయమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా లోకేశ్ బరిలోకి దిగి గెలవచ్చని అన్నారు. ఆయనకు క్యాబినెట్ లో మంత్రి పదవి ఇస్తే, యువతకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుందని అన్నారు. చంద్రబాబునాయుడి కృషితో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News