: జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్య అనుచరుడు, డిప్యూటీ మేయర్ గంపన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటూ ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై త్వరలోనే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ప్రభాకర్ చౌదరి, జేసీ సోదరుల మధ్య అక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.