: తమిళ హాస్య నటుడు కుళ్ళ ప్రభు మృతి


దీర్ఘకాలంగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న తమిళ హాస్య నటుడు కుళ్ళ ప్రభు (52) మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రభు మృతి పట్ల తమిళ సినిమా రంగం సంతాపం ప్రకటించింది. కాగా, పోట్రి, అమర్కళం వంటి చిత్రాలలో నటనకు గాను ప్రభుకు మంచి పేరు వచ్చింది. ప్రముఖ హాస్యనటుడు వడివేలు పక్కన ఆయన పలు చిత్రాల్లో నటించాడు. ఇదిలా ఉండగా, ప్రభు భార్య శోభ మాట్లాడుతూ, సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తమ కుటుంబానికి సహాయపడాలని, ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరారు. తన భర్త గత 22 సంవత్సరాలుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యుడని పేర్కొంది. ప్రభుకు సినిమాల్లో నటించే అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా కుంగిపోయామని శోభ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News