: హీత్రూ విమానాశ్రయంలో అక్షయ్ కుమార్ కు చేదు అనుభవం
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు లండన్ విమానాశ్రయంలో (హీత్రూ) అక్కడి అధికారుల నుంచి నిన్న చేదు అనుభవం ఎదురైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రోబో’ సీక్వెల్ ‘2.1’ షూటింగ్ ముగించుకున్న అక్షయ్ ‘రుస్తుం’ చిత్రం షూటింగ్ నిమిత్తం మంగళవారం లండన్ బయలుదేరారు. బుధవారం ఉదయానికి హీత్రూ విమానాశ్రయంలో దిగారు. అసలు గొడవ ఇక్కడే మొదలైంది. తమ దేశంలోకి అడుగుపెట్టాలంటే కావాల్సిన పత్రాలు సరిగా లేవంటూ అక్షయ్ ని గంటన్నర పాటు విమానాశ్రయంలోనే నిలిపివేశారు. సాధారణ ప్రయాణికులతో పాటే అక్షయ్ ని కూడా ఉండమన్నారు. దీంతో అభిమానులు ఆయన చుట్టూ చేరారు. ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో, కొంచెం ఇబ్బందిపడ్డ అక్షయ్ తనను ప్రైవేట్ ప్లేస్ లో వెయిట్ చేసేందుకు అనుమతించాలని ఎయిర్ పోర్ట్ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది.