: సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం లీకైందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం... పోలీసుల దాడులు!


మెగా అభిమానులకు షాక్. రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైన పవన్ కల్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ పైరసీ సీడీలు కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రత్యక్షం అయ్యాయన్న వార్తలు హల్ చల్ చేస్తుండటంతో పోలీసులు దాడులు చేశారు. చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసిన కొందరు టెక్నీషియన్లు రెండు రోజుల క్రితం చిత్రాన్ని కాపీ చేసుకున్నారని, వీటిని మార్కెట్లోకి పంపారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతో పట్టణంలోని అన్ని సీడీ షాపులు, తయారీదారులపై పోలీసులు దాడులు చేశారు. సీడీలను బల్క్ గా తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే దుకాణాలపైనా దాడులు చేసి అక్కడి కంప్యూటర్లు హార్డ్ డిస్క్ తదితరాలను పరిశీలించారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారని తెలుస్తోంది. అయితే, తమ దాడుల్లో చిత్రం పైరసీ సీడీలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News