: సత్తా చాటిన చిత్తూరు పోలీసులు!... ఇంటర్నేషనల్ ‘రెడ్’ స్మగ్లర్ అజయ్ అరెస్ట్!
శేషాచలం అడవుల్లోని విలువైన ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న స్మగ్లర్లపై చిత్తూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్మగ్లర్లను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టిన ఆ జిల్లా పోలీసులు... తాజాగా నిన్న రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో అజయ్ పై 13 కేసులు నమోదయ్యాయి. కేరళలో సంచలనం రేపిన శ్రీగంధం అక్రమ రవాణా కేసులో కీలక నిందితుడిగా ఉన్న అజయ్.. అదే రాష్ట్రానికి చెందిన వాడు. కేరళలో తన స్మగ్లింగ్ కు అడ్డుకట్ట పడిన నేపథ్యంలో శేషాచలం అడవుల్లోకి ఎంటరైన అజయ్... అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరుగాంచిన దుబాయ్ లోని సాహుల్, హాంకాంగ్ లోని సలీంలకు చెన్నై, ముంబై మీదుగా ఎర్రచందనాన్ని చేరవేశాడు. ఇలా అతడు ఇప్పటిదాకా ఏకంగా రూ.40 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించినట్లు సమాచారం.