: జగన్ ను సీఎంగా చూడాలనుందన్న కడప మహిళలు... 'మీ కల నెరవేరుతుంది' అన్న జగన్!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న, నిన్న తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రెండు రోజులూ దాదాపుగా తన సొంత ఇలాకా పులివెందులకే పరిమితమైన జగన్... తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలు, ప్రజలతో కులాసాగా మాటలు కలిపారు. ఈ సందర్భంగా నిన్న ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తనను కలిసేందుకు వచ్చిన మహిళలతో జగన్ మాట కలిపారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ‘‘సార్, మిమ్మల్ని సీఎంగా చూడాలనుంది’’ అని తమ మనసులోని కోరికను బయటపెట్టారు. దీనికి వేగంగా స్పందించిన జగన్ కూడ ‘‘మీ కోరిక నెరవేరుతుందిలేమ్మా’ అంటూ బదులిచ్చారు.

  • Loading...

More Telugu News