: జగన్ పై నోరు జారిన జేసీ!... వెనువెంటనే 'సారీ' చెప్పిన వైనం!


నోరు తెరిస్తే... సంచలన వ్యాఖ్యలను సంధించే సీనియర్ రాజకీయ వేత్త, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిన్న విజయవాడలో టంగ్ స్లిప్పయ్యారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కోసం విజయవాడ వచ్చిన జేసీ... ఆ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని తనదైన స్టైల్లో వివరిస్తూ పోయారు. ఈ సందర్భంగా జగన్... నిత్యం తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావిస్తుంటారని చెబుతున్న క్రమంలో... జగన్ ను ‘వాడెబ్బ’ అంటూ సంబోధించారు. అయితే వెనువెంటనే తాను నోరు జారిన విషయాన్ని గుర్తించిన జేసీ... సర్దుబాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్... వాడెబ్బ’’ అన్న వెంటనే సర్దుకున్న జేసీ... ‘సారీ సారీ సారీ’ అని దాదాపుగా లెంపలేసుకున్నంత పనిచేశారు. ‘‘మా వాడు అన్న భావనతోనే అన్నాను తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదు. జగన్... దీనిని మరోలా అర్థం చేసుకోవద్దు. మీడియా మిత్రులూ... మీరు కూడా తప్పుగా రాయొద్దు’’ అని జేసీ రిక్వెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News