: ఓయూ ప్రొఫెసర్ కాశీంపై రాజద్రోహం కేసును ఉపసంహరించుకోవాలి: వరవరరావు


మావోయిస్టులకు లేఖలు రాశారనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్, 'నడుస్తున్న తెలంగాణ' పత్రిక సంపాదకుడు కాశీంపై మోపిన రాజద్రోహం కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఆయన మాట్లాడారు. రచయితలను పోలీసు కేసులతో అణగదొక్కలేరని అన్నారు. కాశీంపై పెట్టిన రాజద్రోహం కేసు విషయమై హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డిని కలుస్తామని, వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. కాశీంపై కేసు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ 495 మంది కవులు, రచయితల సంతకాల సేకరణ పత్రాన్ని వరవరరావు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News