: శ్రీలంకలో జరగాల్సిన ఏఆర్ రెహ్మాన్ షో వాయిదా
ఈ నెల 23న శ్రీలంకలో జరగాల్సి ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ షో వాయిదా పడింది. ఈ విషయాన్ని నిర్వాహకులు తెలిపారు. తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ షో వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఏ తేదీన ఈ షో నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా, శ్రీలంక వ్యతిరేక వర్గీయుల ఆందోళనల నేపథ్యంలోనే ఈ లైవ్ కన్సర్ట్ షో రద్దయినట్లు వస్తున్న వార్తలను నిర్వాహకులు తోసిపుచ్చారు.