: చైనా దూకుడు... కృత్రిమ దీవిలో లైట్ హౌస్


దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు మరింత పెంచుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశం కృత్రిమంగా నిర్మించిన దీవిలో లైట్ హౌస్ నిర్మిస్తోంది. గత అక్టోబర్లో దీని నిర్మాణం ప్రారంభించారు. 4.5 మీటర్ల వెడల్పు 55 మీటర్ల ఎత్తుతో దీనిని నిర్మిస్తున్నారు. దీనిలో ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, వెరీ హై ఫ్రీక్వెన్సీ స్టేషన్లు ఉంటాయి. ఈ లైట్ హౌస్ నౌకలకు నావిగేషన్ సర్వీసులు, పొజిషన్ రిఫరెన్సులు సూచిస్తుంది. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చెలాయించేందుకు తాను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దు దేశాలు ఎంతగా గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు.

  • Loading...

More Telugu News