: బీజేపీకి నేటితో 36 ఏళ్లు... ఇప్పటివరకు పదిమంది అధ్యక్షులు!
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి నేటితో 36 ఏళ్లు పూర్తయ్యాయి. 1980 ఏప్రిల్ 6న ఈస్టర్ సండే రోజు బీజేపీని స్థాపించారు. 1984లో జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది. ఇద్దరి విజయంతో మొదలుపెట్టిన బీజేపీ జైత్రయాత్రను దేశంలో అధికారం చేపట్టే దిశగా పది మంది సారధులు నడిపించారు. మొట్టమొదట అటల్ బిహారీ వాజ్ పేయీ అధ్యక్షుడిగా పని చేయగా, ఆ తరువాత ఎల్ కే అద్వానీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం వ్యవహరించారు. అనంతరం మురళీ మనోహర్ జోషీ, కేశూభాయ్ ఠాక్రే, బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలు బీజేపీ అధ్యక్షులుగా వ్యవహరించారు.