: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రిలీజ్ రోజే చూస్తే, కూల్ డ్రింక్ ఫ్రీ!... పశ్చిమ గోదావరి జిల్లా థియేటర్ల ఆఫర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని విడుదలైన రోజే తమ థియేటర్ లో చూస్తే ఉచితంగా కూల్ డ్రింక్ లిస్తామంటూ ఆయా యాజమాన్యాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ సొంత ఊరైన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో కొన్ని థియేటర్లు ఈ ఆఫరు ప్రకటించాయని సమాచారం. పవన్ పై అభిమానులకున్న అభిమానాన్ని ఈవిధంగా క్యాష్ చేసుకోవడానికి ఆయా థియేటర్ల యాజమాన్యాలు ప్రయత్నిస్తుండటం గమనార్హం. కాగా, ఈ చిత్రం ప్రీమియర్ షో టిక్కెట్లను దక్కించుకునేందుకు అభిమానులు పోటీపడుతున్నారని, ఎక్కువ మొత్తంలోనే డబ్బులు పెడుతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.