: పవన్ కల్యాణ్ తన పార్టీనీ టీడీపీకి అమ్ముకోబోతున్నారు: ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడి ఆరోపణ


పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని టీడీపీకి అమ్ముకోబోతున్నారని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ సినిమాల్లో ఎలా నటిస్తున్నాడో పార్టీ పెట్టి కూడా అలాగే నటిస్తున్నాడంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన పవన్, ఏపీకి అన్యాయం జరుగుతుంటే నోరు మెదపడం లేదన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్ముకుంటే, పవన్ కల్యాణ్ జనసేన పార్టీని టీడీపీకి అమ్ముకోబోతున్నారంటూ ఆరోపించారు.

  • Loading...

More Telugu News