: నా దేశం తరపున ఇకపై ఆడను: సెర్బియా టెన్నిస్ స్టార్ ఇవనోవిచ్
తన దేశం తరపున ఇకపై టెన్నిస్ టోర్నీల్లో పాల్గొననని మాజీ వరల్డ్ నెంబర్ వన్ అనా ఇవనోవిచ్ సెర్బియా టెన్నిస్ ఫెడరేషన్ కు తెలిపింది. సెర్బియాకు చెందిన అనా ఇవనోవిచ్ ఇప్పుడు వరల్డ్ 19 ర్యాంకులో కొనసాగుతోంది. ఆమె నిర్ణయాన్ని మార్చుకోవాలని ఎంత చెప్పినా వినిపించుకోలేదని సెర్బియా టెన్నిస్ ఫెడరేషన్ తెలిపింది. ఆమె నిర్ణయం పట్ల సెర్బియా జాతీయ జట్టు కోచ్ టట్ జన జెక్ మినికా విచారం వ్యక్తం చేశారు. ఆమె ఉనికితో సెర్బియా జాతీయ జట్టు పటిష్ఠంగా కనిపించేదని టట్ జన తెలిపారు. కాగా, ఇవనోవిచ్ తన దేశం తరఫున ఇప్పటివరకు 29 మ్యాచ్ లు, ఆడగా 20 మ్యాచ్ లలో విజయం సాధించింది.