: జూనియర్ ఎన్టీఆర్ కారుకు ఫైన్
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉండటంతో రూ.700 ఫైన్ రాశారు. ఈ సంఘటన హైదరాబాదు, అమీర్ పేటలోని మైత్రీవనం చౌరస్తాలో జరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా, కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే తొలగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. నగరంలోకి వచ్చే వాహనాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో, మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే జరిమానా విధించే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉంది.