: అద్వానీ భార్య కన్నుమూత


బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ భార్య కమలా అద్వానీ ఈ సాయంకాలం ఢిల్లీలో కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆమెకు గుండె పోటు రావడంతో ఆమెను హుటాహుటీన ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దీంతో అద్వానీ నివాసంలో విషాదం నెలకొంది. కాగా, బీజేపీ పెద్దదిక్కుగా, పార్టీని ఒంటిచేత్తో మోసిన వ్యక్తిగా అద్వానీని అంతా గౌరవిస్తారు. పార్టీకి ఎనలేని సేవలు చేసిన అద్వానీ జీవితంలో చోటు చేసుకున్న ఈ విషాదంతో పార్టీలో కూడా విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News