: ఆలిండియా నెంబర్ 1 ర్యాంకు సాధించిన హెచ్సీయూ విద్యార్థిని!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బి.ప్రసూన అనే ఇంటిగ్రేటెడ్ విద్యార్థిని సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఆలిండియా నంబర్ 1 ర్యాంకు సాధించింది. ఓ వైపు హెచ్‌సీయూలో రోహిత్ వేముల మరణం తర్వాత ప్రతీరోజు వివాదాలతో ఆ క్యాంపస్ రణరంగాన్ని తలపిస్తోన్న నేపథ్యంలో.. ప్రసూన ఆలిండియా నంబర్ 1 ర్యాంకును సాధించడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో 200 మార్కులకుగాను 158 మార్కులు సాధించిన ప్రసూన, వచ్చే జూలై నెలలో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) లో పీహెచ్డీ ప్రోగ్రాంలో అడుగు పెట్టనుంది. ప్రణాళికా బద్ధమైన చదువు, ప్రొఫెసర్లు అందించిన సహకారంతోనే ఆలిండియా నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నానని ప్రసూన చెప్పింది.