: స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న స్టాక్ మార్కెట్లు
ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు లాభపడి 24,900 పాయింట్ల మధ్య ముగిసింది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి, 7,614 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 8 పైసలు పుంజుకుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.66.69 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో టాటా స్టీల్ సంస్థ షేరు అత్యధికంగా 5.14 శాతం లాభపడి, రూ.328 పాయింట్ల వద్ద ముగిసింది. హిందాల్కో, ఏసీసీ, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థల షేర్లు కూడా లాభపడ్డాయి. బాష్ సంస్థ షేరు ధర అత్యధికంగా 3.09 శాతం నష్టపోయి రూ.19,202 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.