: నేను సారీ చెప్పలేదు...మాటలు వెనక్కి తీసుకుంటానన్నా: రోజా


టీడీపీ ఎమ్మెల్యే అనితను తాను కించపరిచే మాటలు అనలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మీడియాలో వస్తున్నట్టు అనితకు తాను సారీ చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే తాను సభలో చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే వెనక్కి తీసుకుంటానని చెప్పానని ఆమె తెలిపారు. అదే సమయంలో అసెంబ్లీ టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. మహిళా సమస్యలపై పోరాడుతున్నానన్న అక్కసుతో తనపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆమె అడిగారు.

  • Loading...

More Telugu News