: ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్లకు ఇక భారీగా జీతభత్యాలు
క్రికెట్ ఆస్ట్రేలియాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి వారి ప్రతిభను ప్రోత్సహించే దిశగా వారికి భారీ వేతనాలనందించడానికి ఆస్త్రేలియన్ క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా క్రికెటర్ల వార్షిక వేతనం ఏకంగా 37,000 నుంచి 50,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు పెంచారు. మహిళ బిగ్ బాష్ లీగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి, ఆ దేశ ఉత్తమ ప్లేయర్లకు కూడా భారీగా వేతనాలు పెరిగాయి. దీనితో పాటు రవాణా ఖర్చులు, టూర్ ఛార్జీలను అదనంగా క్రికెట్ ఆస్ట్రేలియా అందివ్వనుంది. ఇక సాధారణ మహిళా క్రికెటర్లకు సైతం 14,000 నుంచి 30,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు సంవత్సర ఆదాయం పెరిగింది. దీంతో ఆ దేశంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారిణులుగా ఆస్ట్రేలియా ఉమెన్ క్రికెటర్లు చోటు సంపాదించుకున్నారు.