: 3,000 కోట్ల రెవెన్యూ నష్టపోతారు...మేల్కోండి, నితీష్!: రిషీ కపూర్ ట్వీట్లు


బీహార్లో మద్యనిషేధాన్ని అమలు చేయడం అన్నది బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ కపూర్ కు అస్సలు నచ్చినట్టు కనిపించడం లేదు. దీనిపై ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. 'ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారూ, మీరు చట్టవ్యతిరేక మరియు అక్రమ మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు' అంటూ పేర్కొన్నారు. మద్య నిషేధం ప్రపంచ వ్యాప్తంగా విఫలమైంది...మేల్కోండి అని సూచించారు. మీరు కూడా 3,000 కోట్ల రూపాయల రెవెన్యూ నష్టపోతారని ఆయన హెచ్చరించారు. 'మద్యం సేవిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే 5 ఏళ్ల జైలు శిక్షా? వాహ్.. నితీష్' అని ఆయన ప్రశ్నించారు. ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని చెబుతూనే, తాను 1983లో వచ్చిన 'కూలీ' చిత్రం షూటింగ్ రోజుల నుంచే మద్యం సేవిస్తున్నట్టు ఆయన గొప్పగా చెప్పుకున్నారు.

  • Loading...

More Telugu News