: నా పెళ్లికి వాళ్లని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు, వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్స్!: క్రికెటర్ జడేజా


ఈ నెల 17వ తేదీన జరగనున్న తన పెళ్లికి క్రికెటర్లు ధోనీ, సురేష్ రైనాలను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని క్రికెటర్ రవీంద్ర జడేజా అన్నారు. ఎందుకంటే, వాళ్లిద్దరూ తనకు ఆప్తమిత్రులని, అందుకే వారిని ప్రత్యేకంగా పిలవక్కర్లేదని జడేజా అన్నారు. ఒక బెంగాలీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడేజా సరదాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరూ తన పెళ్లికి తప్పకుండా వస్తారని అన్నాడు. కాగా, మెకానికల్ ఇంజనీర్ రీవా సోలంకిని జడేజా పెళ్లి చేసుకోనున్నాడు. రెండు నెలల క్రితం వారి నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా కాబోయే అత్తింటివారు జడేజాకు ఆడీ క్యూ 7 కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News