: డారెన్ సామీకి స్వదేశంలో అరుదైన గౌరవం
వెస్టిండీస్ టీ20 జట్టు కెప్టెన్ డారెన్ సామీకి కరీబియన్ దీవుల్లోని సెయింట్ లూసియాలో అరుదైన గౌరవం లభించింది. సెయింట్ లూసియాలోని స్టేడియంకు డారెన్ సామీ పేరు పెడుతున్నట్టు, అతనికి ఘన స్వాగతం పలికిన ప్రధాని కెన్నీ డీ ఆంటోనీ తెలిపారు. అలాగే, ఈ స్టేడియంలోని స్టాండ్స్ కు మరో క్రికెటర్ జాన్సన్ పేరుపెడతామని ఆయన చెప్పారు. దీంతో సామి మరోసారి ఉద్వేగభరితుడయ్యాడు. తనకు ఎంతో గౌరవం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సెయింట్ లూసియాను ప్రేమిస్తానని, అందరికీ ధన్యవాదాలని అన్నాడు. కాగా, సామీ సారధ్యంలో విండీస్ జట్టు రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.