: యూపీలో బీఎస్పీ నేత కోడలు ఆత్మహత్య


ఉత్తరప్రదేశ్ కు చెందిన బీఎస్పీ నేత, రాజ్యసభ సభ్యుడు నరేంద్ర కశ్యప్ కోడలు హిమాని ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. ఘజియాబాద్ లో ఈ రోజు ఉదయం ఆమె తమ ఇంట్లో బాత్రూమ్ లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. వెంటనే ఆమెను అక్కడి యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, నరేంద్ర పెద్ద కుమారుడు సంజయ్ కశ్యప్ భార్య హిమాని. ఆమె తండ్రి గతంలో బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. హిమాని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఘజియాబాద్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News