: రాజమండ్రిలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పాటలతో చిన్నారుల డ్యాన్స్.. ఆ వీడియో మీరూ చూడండి!


కొత్త తెలుగు సంవత్సరం (ఉగాది) రోజు విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీలోని రాజమండ్రిలో పవన్ కల్యాణ్ అభిమానించే చిన్నారులు తమ అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ వేషధారణను అనుకరిస్తూ ఈ చిన్నారులందరూ రాజమండ్రిలో రోడ్డుపై డ్యాన్స్ (ఫ్లాష్ మాబ్)లు చేశారు. జీన్స్ ప్యాంట్లు, కాలర్ లెస్ టీషర్టులపై ఖాకీ చొక్కాలు వేసుకుని, ఎర్రటి తువాళ్లను తలకు చుట్టుకున్న ఈ చిన్నారులందరూ కళ్ల జోళ్లు, షూలు ధరించి డ్యాన్స్ లు చేశారు. ఈ డ్యాన్స్ లు చూసేందుకు ప్రజలు భారీగానే వచ్చారు. అయితే, ట్రాఫిక్ సమస్య మాత్రం తలెత్తింది. కొద్దిసేపు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News