: యాదాద్రిలో ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని శ్రీలక్ష్మి నరసింహస్వామిని ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ, యాదాద్రికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ఈ పుణ్య క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.