: క్యూ లైన్లు కొలుద్దురుగాని, వెంట టేపులు తెచ్చుకోండి...పవన్ కల్యాణ్ అభిమానులకు రాంగోపాల్ వర్మ సూచన


ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులకు వివాదాస్పద వ్యాఖ్యల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా ఓ సూచన చేశాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో క్యూ లైన్ల పొడవు కొలిచేందుకు పవర్ స్టార్ అభిమానులు తమ వెంట టేపులు తెచ్చుకోవాలని సూచించాడు. గతంలో 'బాహుబలి' సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానులు ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్ వద్ద 1.5 కిలోమీటర్ల క్యూలైన్ లో నిలబడ్డారని, 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా విడుదల సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఎంత పొడవు క్యూలైన్ కడతారో చూడాలని ఉందని రాంగోపాల్ వర్మ తెలిపాడు. అంత కంటే పెద్ద క్యూలైన్ కట్టి, ప్రభాస్ కంటే పవన్ కల్యాణ్ పెద్ద నటుడని ప్రపంచానికి నిరూపించాలని వర్మ సూచించాడు.

  • Loading...

More Telugu News