: యాక్షన్ సీన్ కోసం నడుముకు బెల్టుతో ఎమీ జాక్సన్
‘రోబో’ సీక్వెల్ ‘2.0’ సెట్ లో ఫొటోను హీరోయిన్ ఎమీ జాక్సన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. బ్లాక్ డ్రెస్సులో నడుంకు బెల్టు కట్టుకుని ఉన్న ఆమె ఒక యాక్షన్ సీన్ కోసం సిద్ధమైనట్లుగా ఆ చిత్రంలో ఉంది. కాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఎమీ జాక్సన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘2.0’. దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో విలన్ పాత్రను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది.