: విశాఖ మన్యంలో పేలిన మావోల మందుపాతర... తృటిలో తప్పించుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లు


ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో నిషేధిత మావోయిస్టులు పేట్రేగిపోతున్నారు. ఒడిశాలో ఇప్పటికే పలు ఘటనల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను పొట్టనబెట్టుకున్న మావోయిస్టులు... తాజాగా ఏపీలోనూ పంజా విసిరారు. అయితే ఈ ఘటనలో మావోయిస్టుల గురి తప్పడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే... విశాఖ జిల్లా మన్యం ప్రాంతానికి చెందిన ముంచంగిపుట్టు పరిధిలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరను మావోయిస్టులు నేటి ఉదయం పేల్చారు. అయితే, సీఆర్పీఎఫ్ జవాన్లు మందుపాతర ప్రదేశానికి కాస్తంత ఆలస్యంగా రావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మందుపాతర పేలిన వెంటనే అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టుల కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. దీంతో అక్కడి ప్రాంతం కాల్పులతో దద్దరిల్లిపోతోంది.

  • Loading...

More Telugu News