: అప్పారావుకు షాక్!... వీసీ వైఖరికి నిరసనగా కౌన్సిల్ భేటీలో ప్రొఫెసర్ రాజీనామా


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావుకు కొద్దిసేపటి క్రితం షాక్ తగిలింది. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పారావు .. సుదీర్ఘ సెలవు తర్వాత తిరిగి విధుల్లో చేరారు. అయితే తన రాకను వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై పై చేయి సాధించేందుకు ఆయన వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధ్యాపకులంతా ఒక్కటిగా ముందుకు కదిలితేనే... వర్సిటీలో పరిస్థితులు చక్కబడతాయని ఆయన ఇచ్చిన పిలుపునకు ప్రొఫెసర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. వీసీగా అప్పారావు వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News