: సిరియా విమానం కూల్చివేత... ఉగ్రవాదుల అదుపులో పైలట్!


సిరియాలో ఓ యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, పారాచూట్ సహాయంతో దూకిన పైలట్ ను ప్రాణాలతో పట్టుకుని బందీగా తీసుకువెళ్లారు. ఈ ఘటన అలెప్పో నగరానికి దక్షిణం వైపున జరిగింది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా, సిరియా దళాలు దాడులకు దిగిన వేళ, ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను తాకగల మిసైళ్లను ఐఎస్ఐఎస్ ప్రయోగించిందని సిరియా సైన్యాధికారి ఒకరు తెలిపారు. పట్టుబడ్డ పైలట్ ను రక్షించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. విమానం కూల్చివేత, ఆపై దాని శకలాలు మంటల్లో మండిపోవడాన్ని వీడియో తీసిన ఉగ్రవాదులు వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తమపై దాడులకు దిగే రష్యా విమానాలనూ వదలబోమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News