: జీహెచ్ఎంసీలో అవినీతి తిమింగలం... రూ.50 కోట్లు కూడబెట్టిన సెక్షన్ ఆఫీసర్


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మరో అవినీతి తిమింగలం బయటపడింది. జీహెచ్ఎంసీలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న జనార్దన్ మహేశ్... భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలతో నేటి తెల్లవారుజామున ఆయన ఇంటిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (టీ ఏసీబీ) దాడి చేసింది. నగరంలోని సఫిల్ గూడ, ఆర్కేపురం తదితర ప్రాంతాల్లోని ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.50 కోట్ల మేర అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News