: విశాఖలో కనిపించిన 12 అడుగుల 'గిరినాగు' ఇదే!
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం తురువోలులో ఓ అరుదైన సర్పం కంటబడింది. దాదాపు 12 అడుగులకు పైగా పొడవైన ఈ నాగుపాము, శరీరం లేత ఆకుపచ్చ రంగులో ఉండగా, నల్లటి తోక, తెల్లని చారలు ఉన్నాయి. దీన్ని గిరినాగు అని పిలుస్తారని, కోళ్లను చంపి తినే విషపూరిత పామని అక్కడి వారు తెలిపారు. ఈ పామును చూసిన తురువోలు గ్రామ ప్రజలు, తొలుత భయపడినా, ఆపై దాన్ని కొట్టి చంపారు. ఇద్దరు మనుషుల పొడవు కన్నా ఎక్కువగా ఉన్న ఈ భారీ పాము చిత్రాన్ని మీరూ చూడవచ్చు.