: అంతా ఏకపక్షమే!... సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికలు ప్రారంభం


మెదక్ జిల్లా సిద్దిపేట మునిసిపాలిటీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే కాక ఆ పార్టీ సీనియర్ నేత, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు సొంత ఇలాకా అయిన సిద్దిపేటలో టీఆర్ఎస్ కు తిరుగు లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్, ఆ తర్వాత హరీశ్ రావు అక్కడి నుంచి బంపర్ మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హరీశ్ రావు సాధించిన మెజారిటీని చూసి నాటి సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం అశ్చర్యపోయారు. టీఆర్ఎస్ కు అంతగా పట్టున్న సిద్దిపేటలో ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల్లో పోలింగ్ సాంతం ఏకపక్షంగానే జరగనుందని విశ్లేషకుల అభిప్రాయం. నేటి ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News