: హృతిక్ రోషన్ కు అల్టిమేటం జారీ చేసిన కంగనా రనౌత్


'క్షమాపణ చెప్పి నోటీస్ ఉపసంహరించుకుంటే సరే, లేదంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని' బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లాయర్ ద్వారా మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ కు అల్టిమేటం జారీ చేసింది. తాము పంపిన లీగల్ నోటీసుకు హృతిక్ రోషన్ ఇంకా సమాధానం చెప్పలేదని తెలిపింది. వివాదాన్ని ముగించాలని కంగనా కోరుకుంటోందని, హృతిక్ రోషన్ లీగల్ నోటీసులు ఉపసంహరించుకుంటే వివాదం ఇంతటితో సమసిపోతుందని, ఆలస్యం చేస్తే సంక్లిష్టమవుతుందని కంగనా లాయర్ హెచ్చరించారు. తనపై చేసిన మిస్టర్ ఎక్స్ వ్యాఖ్యలకు గాను మీడియా సమావేశం పెట్టి, బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ హృతిక్ రోషన్ కంగనాను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News