: చీరాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న నకిలీ ఐపీఎస్ అరెస్ట్
పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఐపీఎస్ అధికారిని ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు అరెస్టు చేశారు. కారంచేడు ఎస్సై రాజేష్ విచారణలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం బయటపడింది. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని ఎర్రబాలెంకు చెందిన పుల్లారావు అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు.