: గేల్ ను 'లూజర్' అంటూ గేలి చేసిన జమైకా చిరుత


టీ20 ఛాంపియన్ వెస్టిండీస్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ప్రశంసలతో జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ కూడా గొంతు కలిపాడు. టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న వెస్టిండీస్ జట్టుకు బోల్ట్ శుభాకాంక్షల వీడియో పంపాడు. ఈ వీడియోలో డ్వెన్ బ్రావో రాసి, ఆలపించిన ఛాంపియన్స్ గీతాన్ని తను పాడాడు. ప్రతి విండీస్ ఆటగాడి పేరును ఈ పాటలో జత చేసిన బోల్ట్ ఆఖర్లో గేల్ ను 'లూజర్' అన్నాడు. కీలకమైన సెమీ ఫైనల్, ఫైనల్లో గేల్ విఫలం కావడం పట్ల బోల్ట్ అలా అని ఉంటాడని అభిమానులు సర్దిచెప్పుకుంటున్నారు.

  • Loading...

More Telugu News