: కేసీఆర్ తిరుమల శ్రీవారి మొక్కుల ఆభరణాలు తయారవుతున్నాయి!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు చేయిస్తానని నాడు కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఆ మొక్కును సీఎం కేసీఆర్ త్వరలోనే తీర్చుకోనున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాళిదాస్ జ్యుయెలర్స్ ఈ మొక్కు ఆభరణాల తయారీ టెండర్ దక్కించుకుంది. వాటిలో సాలిగ్రామహారం, బంగారు కంఠె ఇప్పటికే తయారయ్యాయి. 22 క్యారెట్ల స్వచ్ఛతతో గ్రాము రూ.2,611కు ఒప్పందం కుదుర్చుకుంది. 14.900 కిలోల సాలి గ్రామహారం ఖరీదు రూ.3.70 కోట్లు, ఐదు పేటల బంగారు కంఠెకు రూ.1.21 కోట్లు ఖర్చయింది. ఈ రెండు ఆభరణాలు కాక, మరో మూడు ఆభరణాలు కూడా ఉన్నాయి. మరో పదిహేను రోజుల్లో ఈ ఆభరణాలు కూడా తయారు కానున్నట్లు సమాచారం.