: మహిళల కోసం... ఆకర్షణీయంగా తయారవుతున్న ‘నిర్భీక్’ తుపాకులు


తక్కువ బరువు, ఆకర్షణీయమైన రంగుల్లో ‘నిర్భీక్’ తుపాకులను డిజైన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కాన్పూర్ ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఆపదలో ఉన్న సమయంలో మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా రూపొందించిన ఈ తుపాకి నమూనాలో మార్పులు చేస్తున్నామన్నారు. ఈ తుపాకి బరువు మొదట్లో 750 గ్రాములుందని, అయితే ఇప్పుడు ఆ బరువును 500 గ్రాములకు తగ్గించామన్నారు. దీని బరువు మరింతగా తగ్గించి కలర్ కోడింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నామని అన్నారు. కాగా, ఒక్కొక్క నిర్భీక్ తుపాకి ధర రూ.1.22 లక్షలు ఉందని, వీటి ధరలను ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం, కదలుతున్న ఒక బస్సులో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. అనంతరం నిర్భయ చట్టంను కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ సంఘటన తర్వాతే కాన్పూర్ కు చెందిన తుపాకుల తయారీ సంస్థ నిర్భీక్ పేరిట తుపాకులను తయారు చేసింది. వీటికి పంజాబ్, ఢిల్లీలలో మంచి డిమాండ్ ఉంది.

  • Loading...

More Telugu News