: మద్దతివ్వకపోతే పార్లమెంటునే రద్దు చేస్తా: ఐస్ లాండ్ ప్రధాని


పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కుదిపేస్తూ, ఆయా దేశాధినేతల మనుగడను దారుణంగా దెబ్బకొడుతోంది. ఈ జాబితాలో ఐస్ లాండ్ ప్రధాని సిగ్ ముండర్ డేవిడ్ గున్లాగ్సన్ పేరు కూడా చోటు చేసుకోవడంతో, ఇన్నాళ్లూ ఆయనకు మద్దతుగా నిలిచిన ఇండిపెండెంట్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటామని పేర్కొంది. దీనిపై సిగ్ ముండర్ డేవిడ్ స్పందించారు. ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు వెళ్తానని ఆ పార్టీ అధినేతకు చెప్పినట్టు సిగ్ ముండర్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. కాగా, పనామా పత్రాల్లో పేర్లు వెల్లడైన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వాటిని ఖండిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News