: ‘పనామా’ పేపర్లలో జగన్ పేరు కచ్చితంగా వస్తుంది: ఎమ్మెల్యే బొండా ఉమా
‘పనామా’ పేపర్లలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు కచ్చితంగా వస్తుందని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అన్నారు. జగన్ అవినీతి బాగోతంపై సీబీఐ ఆరు దేశాలకు లేఖలు రాసిందని, ఆ పేపర్ల ద్వారా జగన్ పేరు బయటకు వస్తే ఆయన అవినీతి విషయాలు మరిన్ని బయటపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్నో ఎంక్వైయిరీ కమిటీలు వేశారని, ఎటువంటి మచ్చ లేకుండా బాబు బయటపడ్డారని బొండా ఉమ అన్నారు.