: వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న సల్మాన్ ఖాన్


శస్త్ర చికిత్స చేయించుకునేందుకు అమెరికా వెళతానని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపాడు. మెదడులో నరాల సంబంధిత వ్యాధి (ట్రిజెమెనియల్ న్యూరాల్జియా)తో కొంత కాలంగా బాధపడుతున్న సల్మాన్ కు 2011 లో అమెరికాలో శస్త్ర చికిత్స జరిగింది. తాజాగా మరో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు జనవరిలో ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే కోర్టు కేసులు, సినిమాలతో తీరిక లేక వెళ్లలేకపోయానని, అందుకే ఇపుడు అమెరికాలో చికిత్స చేయించుకోవాలని అనుకుంటున్నట్లు సల్మాన్ తెలిపాడు. ప్రస్తుతం సీసీఎల్ క్రికెట్ లీగ్ లో భాగంగా సల్మాన్ కోచిలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News