: సమ్మర్ గ్యాడ్జెట్స్ పై భారీ ఆఫర్లు... కస్టమర్లను ఆకర్షించే యత్నాల్లో ‘ఫ్లిప్ కార్ట్’ !


సమ్మర్ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఇచ్చి కస్టమర్లను తన వైపు తిప్పుకునేందుకు ఆన్ లైన్ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రయత్నిస్తోంది. ‘కూలింగ్ డేస్’ పేరుతో ఆయా సమ్మర్ గ్యాడ్జెట్లపై డిస్కౌంట్లను ఇస్తోంది. శాన్ సూయి, వర్ల్ పూల్, ఎల్ జీ, వోల్టాస్, హిటాచి, బజాజ్ సంస్థలకు చెందిన ఉత్పత్తులపై ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ల ఆఫర్ ఇస్తోంది. శాన్ సూయి కంపెనీకి చెందిన 1.5 టన్ ఫైవ్ స్టార్ స్ప్లిట్, 1 టన్ ఫైవ్ స్టార్ స్ప్లిట్ ఏసీలు వరుసగా రూ.23,990, రూ.19,990లకు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తాయి. వర్ల్ పూల్ 245 లీటర్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ. 17,990, గోద్రెజ్ 185 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.12,990. అంతేకాకుండా, ఫ్యాన్లపై కూడా మంచి డిస్కౌంట్లను ఫ్లిప్ కార్ట్ ‘కూల్ డేస్’లో ఆఫర్ చేస్తోంది.

  • Loading...

More Telugu News