: పుర్రెతో ఎయిర్ పోర్టులో ప్రొఫెసర్...బెంబేలెత్తిన అధికారులు
మనిషి పుర్రెతో ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఓ ప్రొఫెసర్ గారు రోమ్ అధికారులను బెంబేలెత్తించారు. వివరాల్లోకి వెళ్తే...ఫియోమిసినో ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేస్తున్న భద్రతా సిబ్బంది అతని లగేజీలో పుర్రెను గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న భద్రతాధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. తాను ప్రొఫెసర్ ని అనీ, రోమ్ లోని చారిత్రక ప్రదేశంలో ఆ పుర్రెను 50 యూరోలకు కొనుగోలు చేసినట్టు, పరిశోధనల కోసం దానిని తీసుకువెళుతున్నట్టు ఆయన వివరించారు. అయితే, భద్రతాధికారులు మాత్రం ఆయన చెప్పిన విషయాన్ని నమ్మడం లేదు. పైగా, ఆ పుర్రె దవడ భాగం ఎక్కడుందనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆ పుర్రె ఎవరైనా ప్రముఖ వ్యక్తికి చెందినదా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.